![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -10 లో.. రామలక్ష్మి దగ్గరికి వాళ్ళ మేడమ్ వచ్చి జాబ్ నోటిఫికేషన్ వచ్చింది చూసావా అని అడుగుతుంది. చూసానని రామలక్ష్మి చెప్పగానే.. ఇకనుండి ఇలా రెండు గంటలు మాత్రమే చదివితే కుదరదు. టైమ్ ఎక్కువ లేదు. రోజుకి 18 గంటలు చదవాలి. ఇక క్యాబ్ మానెయ్ అని మేడమ్ చెప్తుంది. లేదు మేడమ్ ఫ్యామిలీ ని నేనే పోషించలని రామలక్ష్మి చెప్తుంది. అలా అయితే ఎలా నీ గోల్ ని నువ్వు చేరుకోవాలి సక్సెస్ కావాలంటే కంప్రమైజ్ కావద్దని మేడమ్ చెప్తుంది. కాలేజీలో ఫీజు కట్టాలని రామలక్ష్మికి మేడమ్ చెప్తుంది.
ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వచ్చి మేడమ్ చెప్పిన దాని గురించే ఆలోచిస్తుంటుంది. ఏమైంది అలా ఉన్నావని వాళ్ళ అమ్మ అడుగుతుంది. మేడమ్ చెప్పిన విషయం చెప్తుంది. మరి ఇప్పుడు ఎలా ఫీజు కడతావని అంటుంది. వెంటనే మాణిక్యం దగ్గరికి వెళ్లి.. ఇకనుండి మన కూతురు ఏం పని చెయ్యదు.. చదువుకుంటుంది ఇక నువ్వే వెళ్లి పని చెయ్యాలని చెప్పగా.. నేను చెయ్యను అవసరమైతే దాన్ని చదువు మానెయ్యమను అని మాణిక్యం అంటాడు. ఆ మాటలు విన్న రామలక్ష్మి బాధపడుతుంది. ఆ తర్వాత మాణిక్యం దగ్గరికి వచ్చి.. కలెక్టర్ అనేది నా జీవిత ఆశయం. నేను కలెక్టర్ అవ్వాలనుకునేది. మీ కోసం మీకు సమాజంలో గుర్తింపు కోసం.. నేను చదువు మానుకోను. నేను చేసే వర్క్ మానుకోను బాధ్యత మర్చిపోనని రామలక్ష్మి తన నాన్నకి చెప్తుంది.
ఆ తర్వాత సీతాకాంత్ బయటకు వెళ్తుంటే డ్రైవర్ ఒక అమ్మయితో మాట్లాడుతుంటాడు. ఆ అమ్మాయి ఏడుస్తుంటుంది. అది చూసి ఏమైందని సీతాకాంత్ అడుగుతాడు. ఆ అమ్మాయి మా బస్తీలో ఉంటుంది. కాలేజీ ఫీజు కట్టాలని డ్రైవర్ చెప్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ ఆ అమ్మాయిని పిలిచి తను చదివే కాలేజీకి తీసుకొని వెళ్లి ఫీజు నేను కడుతానని చెప్తాడు.. ఇక్కడ చదువుకునే వాళ్ళందరు బయట పార్ట్ టైమ్ చేస్తూ చదువుకుంటున్న వాల్లేనని తెలిసిన సీతాకాంత్.. అందరికి ఫీజు నేను కడుతాను. ఈ విషయం అందరి స్టూడెంట్స్ కి మెసేజ్ పాస్ చేయించండని చెప్తాడు. అలా రామలక్ష్మికి కూడా ఫీ పే చేసినట్లు మెసేజ్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎవరో ఒకతను ఇదంతా చేసాడని తెలుసుకున్న రామలక్ష్మి.. థాంక్స్ చెప్పాలని వెళ్ళేలోపే సీతాకాంత్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రామలక్ష్మి తన క్యాబ్ లో కొంతమంది చిన్నారులని ఒక ప్రోగ్రామ్ దగ్గరికి తీసుకొని వస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ లో మంటలు అంటుకుంటాయి. రామలక్ష్మి వెళ్లి కాపాడుతుంది. అలాగే అటుగా వెళ్తున్న సీతాకాంత్ ఆగి చిన్నారులని కాపాడతాడు. ఆ తర్వాత రామలక్ష్మి, సీతాకాంత్ లు ఒకరినొకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |